సర్వే 2010

మిత్రమా !

మన తెలుగుపరిశోధన సైట్‌ను ఆధునీకరింతామనుకుంటున్నాము. అయితే ఇప్పటివరకు పుస్తకాలను అందించడమే ఇక్కడ జరుగుతున్న పని. అదీ ఫోరం రూపేణ. కొంతమంది సభ్యులు ఈ ఫోరం పద్ధతి బాగు లేదని,మార్పులు చేయమని అడిగినారు.

అందుకే అందరికీ నచ్చే పద్ధతుల్లో మార్పులు చేర్పులు చేద్దామనుకుంటున్నాము. దాదాపు మన సభ్యులు మూడు వేలకు దాటి ఉన్నారు. మీకు ఈ సైట్ చూసినప్పుడు “ఇలా ఉంటే బాగుండు, ఇవి చేరిస్తే బాగుండు” వంటివి అనిపించే ఉండవచ్చు. అటువంటివి మాకు చెబితే మేము వాటిని ఒకదగ్గర గుదిగూర్చి, ఒక పద్ధతిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. మన తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల ను కాపాడుకోవడానికి, భావితరాలకు అందించడానికి చేస్తున్న ఈ
సేవలో మీ వంతు మాట సహాయం, ఆలోచనా సాయం చెయ్యండి.

మీ అభిప్రాయాలను http://bit.ly/survey-2010 లో తెలుపండి. మీ అభిప్రాయాలు ఎంతత్వరగా వస్తే మా పని అంత వేగంగా ప్రారంభమవుతుంది. దయచేసి ఒక కొద్దిసేపు తీరిక చేసికొని స్పందించరూ?

మీ స్పందనల కోసం నిరిక్షిస్తూ…

తెలుగు పరిశోధన బృందం

కంఠస్థపద్యాలు (10 వ తరగతి)2009-10

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో, తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహాయకారిగా ఉండాలని ఈ ప్రయత్నం. రోజూ ఒకటి రెండుమార్లు ఈ పద్యాలు వినడం వల్ల పద్యపూరణలో విద్యార్థులు అవలీలగా మార్కులు సంపాదించుకోగలరని విశ్వసిస్తున్నాము.

పద్యపఠనం చేసినవారు:- శేషం వేణుగోపాల శర్మ, తెలుగు పండితులు, జి.ప.ఉ.పా. రామడుగు. కరీంనగర్ జిల్లా.

కొత్త సభ్యులకు ఆహ్వానం

తెలుగు సాహిత్యాభిమానుల మన్ననలు పొందిన తెలుగుపరిశోధన లో గత కొద్దికాలంగా (సాంకేతిక పరమైన ఇబ్బందులవల్ల) కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పుడు మా బృంద సభ్యులు ఆ సమస్యను పరిష్కరించారు. పరోక్షంగా సేవ చేస్తున్న వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అంతే కాకుండా మన సైట్ నిర్వహణలో అత్యంత ప్రధాన వ్యక్తి ఎమ్వీగారు. వారు త్వరలో (వారు సంకల్పించిన ప్రాజెక్ట్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని) తిరిగి మనముందు ఉండ బోతున్నారు. వారు వచ్చిన తరువాత సాంకేతిక సమస్యలు తలెత్తవని, లేదా క్షణాల్లొ పరిష్కరించబడతాయని తెలుపుతూ… వారికి సాదర స్వాగతం పలుకుతున్నాను.

ఈ సైట్ ప్రారంభమైన నాటినుండి నేటి వరకు 813253 విషయ సందర్శనలు (Topic vews) అయినట్లు మా రికార్డులు తెలుపుతున్నాయి. అంటే రోజుకు దరిదాపు 1500 వరకు నొక్కులు (Clicks) అవుతున్నాయన్నమాట. ఇది మన తెలుగువాడి భాషాసాహితీ సంస్కృతుల అభిమానాన్ని తెలుపుతుంది. అందుకు మన తెలుగువారినందరినీ అభినందిస్తున్నాను.

ఈ విజయ నేపథ్యంలో వచ్చే ఉగాదినాటికి కొత్తదనంతో మీ ముందుండాలని మీ తెలుగుపరిశోధన ఉవ్వీళ్ళూరుతుంది. చూద్దాం ఎలా కానుందో!

మరొక్కమాట – మన టూల్‌బార్‌ను విస్తృతంగా వినియోగించుకొమ్మని మిమ్మల్ని కోరుతున్నాను. దానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు ఎప్పుడు స్వీకరిస్తూనే ఉంటాము.

మరింత మెరుగైన సేవలు అందించేందుకు మీ అభిమానాన్ని ఆశిస్తూ…..

-పాండురంగశర్మ
(తెలుగుపరిశోధన తరపున)