IPB

Welcome Guest ( Log In | Register )

Home  Toolbar  Announcements  Research Books  Telugu  Sanskrit  Reference Library  Lyrics  General  Feedback  font help
 
Reply to this topicStart new topic
> Hidden Links
post Oct 14 2009, 10:21 PM
Post #1
RPSharma
Group: Team Teluguthesis
Advanced Member
***

  Joined: 2-October 08
From: Hyderabad

Posts: 1,426


హిడెన్ లింక్స్ ఎందుకు ఏర్పాటు చేసామంటే

ఈ సైటుని హైపర్‌వెబ్ ఎనేబుల్‌వారు సమర్పిస్తున్నారు. వారి నిబంధనల ప్రకారం నిరంతరం సైట్‌లో వ్యవహారాలు నడుస్తుండాలి. ఇక్కడ మనం సభ్యులకొరకు కేవలం పుస్తకాలు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము. అవీ జనాకర్షకమైనవి కావు. ఏ నవలలో లేదా పత్రికలో అయితే వాటికొరకు జనాలు ఎగబడేవారు. కాని, ఇక్కడ అన్నీ కేవలం విద్యావిషయమైనవే. ఇటువంటివాటిని ఆదరించడానికి జనాలకు ఆసక్తి తక్కువని అనుభవంకొద్దీ చెబుతున్నాము.
ఇటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి కావడంవల్ల ఇలా కొన్నీటిని దాచిపెడుతున్నాము. అక్కడికీ చాలావరకు పుస్తకాలను ఆన్‌లైన్‌లో అక్కడే చదివే అవకాశం కలిగిస్తున్నాము.
How to download?
QUOTE
పుస్తకం దిగుమతికి కావాలి అనుకునేవాళ్ళు మాత్రమే తప్పనిసరిగా జవాబు వ్రాయాల్సి ఉంటుంది.
అలా జవాబు రాయగానే మరొకసారి పైన ఉన్న మొదటి టపాదగ్గర చూడండి. అక్కడ ఇప్పుడు గులాబీ రంగులో ఆ పుస్తకం పేరు కనపడుతుంది. దానిపై నొక్కండి. మీకు పి.డి.ఎఫ్. లో పుస్తకం దిగుమతి అవుతుంది.

ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన ఈ దాచిపెట్టడాన్ని మా సభ్యులందరూ సహృదయతో అర్థం చేసుకొని సహకరిస్తారనే మా ఆశ.

అంతే కాకుండా మా సభ్యులందరితో చిన్న అభ్యర్థన.
1. మీలో రచయితలూ,కవులూ ఉండి ఉంటారు. మీ పుస్తకాలని కూడా ఈ సైట్‌లో పెట్టండి.
2. మీకు కూడా సైట్స్/బ్లాగ్స్ ఉండే ఉంటాయి. వాటిలో ఈ సైట్‌గురించి కూడా వ్రాసి, మాకు సభ్యులు పెరిగేట్టు,
పోష్టింగ్స్ పెరిగేట్టు సహకరించగలరు.
3. తెలుగుపరిశోధన సైట్‌ను మీ హోంపేజీ గా చేసుకోండి. దానికి సైట్‌లో పైన ఎడమ వైపు ఉన్న Set Home అనే
బటన్ నొక్కండి.
4. ఈ సైట్‌ను మీ Favorates లో చేర్చుకోవాలంటే అక్కడే పక్కన ఉన్న స్టార్‌పై నొక్కండి.
5. ఏ విధమైన లాభాపేక్షలేకుండా, మేము చేస్తున్న సేవను మీరంతా హృదయపూర్వకంగా ఆదరిస్తారని
ఆశిస్తున్నాము

మీ అభిమాన తెలుగు పరిశోధన బృందం
Go to the top of the page
+Quote Post

Reply to this topicStart new topic
1 User(s) are reading this topic (1 Guests and 0 Anonymous Users)
0 Members:

 



FileServe
Visits Counter :
RSS Lo-Fi Version Time is now: 7th September 2010 - 06:29 AM
Design by: Download Free Invision Power Board Skins
 Type in